ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రమూకలు చేసిన దాడులను భారత ప్రభుత్వం ఖండించగానే.. మనదేశంలో ఒక్కసారిగా వ్యతిరేక స్వరాలు నిద్రలేచాయి. మోడీ సర్కారు తీసుకున్న స్టాండ్ సరైంది కాదంటూ.. రకరకాల కారణాలు చూపుతూ గగ్గోలు పెట్టాయి. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్ లోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు రోడ్డెక్కారు. పాలస్తీనా తగలబడిపోతుందని.. వారికి అండగా ఉంటామంటూ నిరసన ర్యాలీలు చేపట్టారు. అరబ్బులు అధికంగా ఉన్న పాలస్తీనా ఒకప్పుడు ఎలా ఉంది..? ఇప్పుడెలా అయ్యింది..? అందుకు కారణం ఎవరు..? అంటూ రకరకాల చర్చలు పెట్టారు. కుహానా మేధావులు, విపక్ష నాయకులు, కమ్యూనిస్టులు, సెక్యులర్లు, ఓ సెక్షన్ మీడియా.. ఇలా అంతా పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు.
అయితే వీరి ఆవేదన ఏంటంటే.. ఒకప్పుడు పాలస్తీనాగా ఉన్న దేశమంతా తర్వాతికాలంలో యూదులు వచ్చి ఆక్రమించుకున్నారని.. ఇజ్రాయెల్ చేస్తున్న అక్రమాలను అడ్డుకునేందుకు హమాస్ పనిచేస్తుందని.. అందువల్ల వారికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. వలస వచ్చిన వారు దేశాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా..