సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 08-01-2026 ఉదయం 6:00 నుండి 23-01-2026 ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుంది. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించడమైనది.