ములుగు జిల్లా:సెప్టెంబర్ 14
ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం.. చోటుచేసుకుంది
హైదరాబాద్ నుండి ఏటూరు నాగారం వైపు వస్తున్న కారును మరో బొలెరో వాహనం ఢీ కొట్టింది, ఈ ప్రమాదంలో రాంకుమార్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. రామ్ కుమార్ ఖమ్మం జిల్లా వాసిగా గుర్తించారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు….