టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

హైదరాబాద్:సెప్టెంబర్ 14
టి ఎస్ ఆర్ టి సి విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.

దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *