పిఠాపురం గడ్డపై సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా పీఠికాపురంలో అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ . ఈ పండుగ ప్రారంభ కార్యక్రమంలో పిఠాపురం గురించి జరుగుతున్న, చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని గొడ్డలితో వేటాడి చంపినా అది కొందరికి వార్తగా కనిపించదు.. 