సంక్రాంతి పండుగని పురస్కరించుకుని
నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గురువారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు.