సంగారెడ్డి జిల్లా:సెప్టెంబర్ 14
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు
బుధవారం సాయంత్రం స్థానిక దేవుని గుట్ట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. చిరుత సంచారాన్ని స్థానిక యువకులు తమ ఫోన్‌లలో చిత్రీకరించారు.
గ్రామ శివారులో చిరుత సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.