ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఆలయాన్ని నిర్వహించే సంస్థ టీటీడీ.. ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం స్వామివారి ఆలయం బాగోగులు చూడడమే..
అంతేకాదు దేశం నలువైపులా వివిధ సామజిక, ధార్మిక, సాంస్కృతి వంటి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తుంది.
ఈ నేపథ్యంలో టీటీడీ సంస్థ నిర్వహణ కోసం చైర్మన్, బోర్డు మెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే కొత్తగా టీటీడీ సభ్యులను ప్రభుత్వం నియమించింది.
వారికీ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నేర చరిత్ర ఉన్నవారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.
టీటీడీలో ఏర్పాటు చేసిన కొత్త పాలకమండలి సభ్యుల్లో కొందరికి నేర చరిత్ర ఉందని హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ