ఖమ్మం జిల్లా:సెప్టెంబర్ 15
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులని, గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లు ఆయోదించటం సంతోషమని మంత్రి హరీష్ రావు అన్నారు.
గురువారం ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, ప్రతిపక్షాలు ప్రజలకు పగోళ్ళు పని చేస్తున్నారని… పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని.. రాబోయే ఎన్నికలలో నోబెల్స్‌కు గ్లోబెల్స్‌కు మధ్య పోటీ జరగబోతోందని అన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణే నంబర్ వన్ అని హరీష్ రావు అన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏంచేస్తున్నారు?.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫథకాలలో ఒక్కటైనా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని నిలదీశారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. సీతారామ ఎత్తిపోతల పనులు చివరి దశలో ఉన్నాయని, మరో మూడు నెలలో పూర్తి అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో కృష్ణా, గోదావరి జలాలతో ఇక కరువనేదే ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు.