బెంగళూరు: సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా సాగుతోంది. ఆదిత్య ఎల్-1 (Aditya L1 Mission)ఉపగ్రహానికి మంగళవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టింది..
బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.
మారిషస్, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో(ISRO) గ్రౌండ్ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం 256 km x 121973 km కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని ఈ నెల 19న చేపట్టనున్నారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్-1కు నాలుగు నెలలు పడుతుంది..