కొత్తగూడెం జిల్లా:
ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది.
మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్మికుల బ్యాంక్ ఖాతాలో ఏరియర్స్ జమ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ లెక్కన ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది. త్వరలో దసరా, దీపావళి బోనస్ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది..