మంచు లక్ష్మి కాషాయ కండువా కప్పుకోవడం ఫిక్సేనా?

హైదరాబాద్:
మోహన్ బాబు కూతురు పొలిటికల్ ఎంట్రీ కి గ్రౌండ్ వర్క్ చేసుకుంది.మోదీకి మంచు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండగా గతంలో మోదీ, మోహన్ బాబు చాలాసార్లు కలిసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే

బీజేపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించటానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి మంచు లక్ష్మికి పిలుపు అందిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ భావిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం దారుణంగా ఉంది.మంచు లక్ష్మి బీజేపీలోకి నిజంగా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మంచు లక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మంచు లక్ష్మి ఢిల్లీ పర్యటన ఊహాగానాలను తావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.మహిళా బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో పేరున్న ఎంతోమంది మహిళలను పిలిపించి మాట్లాడనున్నారని అందులో భాగంగా మంచు లక్ష్మికి ఆహ్వానం అందిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మంచు లక్ష్మి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసిన తర్వాత మాత్రమే ఇతర విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *