హైదరాబాద్:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు.కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోట అమలు చేసేలా జాతీయ స్థాయిలో కృషి చేయాలని కోరారు. 40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని.. ఢిల్లీలో 80సార్లు ధర్నా చేశామన్నారు.
అలాగే బీసీల కోసం.. బీసీ బిల్లు కోసం 65 సార్లు ప్రధాన మంత్రులను కలిసామని, కానీ ఈనాటికి బీసీలకు న్యాయం జరగటంలేదన్నారు. అన్ని పార్టీలను కలిసి బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా చేయాలని కోరామని తెలిపారు.
దశాబ్దాలుగా బీసీ బిల్లుకు మోక్షం కలగటంలేదని.. ఇప్పటికైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక బీసీల బిల్లు ప్రవేశపెట్టే సమయం వచ్చిందని బీసీల నినాదం ఢిల్లీని తాకిందన్నారు.
ఇక బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు…