సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి టీయూఎ్‌ఫఐడీసీ నుండి 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర జీవో నెం.727 ద్వారా జారీ చేసిన ప్రభుత్వం ఉత్తర్వులను ఐటి మరియు పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ గారు, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ గారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గార్లు అందుకున్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ పట్ల హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రారంభోత్సవాలకు విచ్చేయాలని మంత్రి కేటీఆర్ గారికి హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ గారికి ఆహ్వానం పలికారు.